డెస్క్ టాప్ భద్రత
మీ కంప్యూటర్ ను సురక్షితంగా సెటప్ చేసుకోడానికి
వ్యాపారస్తులు అందించిన పత్రాన్ని జాగ్రత్తగా చదవి దానిలోని మార్గదర్శక సూత్రాలను పాటించండి
మీ డెస్క్ టాప్ కంప్యూటర్ ను ఎందుకు సురక్షితంగా వుంచుకోవాలి ?
మనం పర్సనల్ కంప్యూటర్లను సరైన భద్రతా పరమైన అంశాలు పాటించకుండా వినియోగించడం జరుగుతోంది. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారు ఇలాంటి సురక్షితం కాని కంప్యూటర్లను తమ వనరులుగా మార్చుకోని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలు వైరస్, ట్రోజాన్స్, కీలాగర్స్ మరియు కొన్ని సమయాలలో నిజమైన హకర్స్ గా కూడా ఉండవచ్చు. దీనివల్ల డేటా చోరీకి గురవడం, డేటా పోగొట్టుకోవడం, వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం, పాస్ వర్డ్ లాంటి ముఖ్యమైన అంశాలు చోరీకి గురవడం మొదలగునవి జరుగుతున్నవి. కావున మీ పర్సనల్ కంప్యూటర్ భద్రత మరియు రక్షణ విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదు
" బంగారం లాటి పాత కాలం సామెత .. .. విరుగుడు ( చికిత్స) కన్నా ఆపుదల మిన్న "
మీ పర్సనల్ కంప్యూటర్ ఉపయోగించే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు
ఎల్లప్పుడూ లైసెన్సు ఉన్న సాప్ట్ వేర్ లనే మీ కంప్యూటర్ లో పెట్టుకోవాలి. దీనివల్ల మీ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు అప్లికేషన్స్ ను ఎప్పటికప్పుడు తాజాగా (updates) ఉంచవచ్చు. మీరు ఒకవేళ ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ వాడుతువున్నట్లయితే దానిని తరచూ తాజాగా వుంచుకోవడం (updates) చేయండి.
సాప్ట్ వేర్ ను కంప్యూటర్ లోకి ప్రవేశపెట్టే ( install ) ముందు వ్యాపారులు అందజేసిన, సాప్ట్ వేర్ లలో ఉన్న నియమ నిబంధనలు (Terms and Conditions) /లైసెన్సు ఒప్పందం (License Agreement) అన్న అంశాలు పూర్తిగా చదువండి.
మీ పర్సనల్ కంప్యూటర్ ను వినియోగించిన తరువాత ఆపివేసేప్పుడు సరైన విధానం పాటించండి మరియు కంప్యూటర్ తో పాటు మానిటర్, మోడెమ్ , స్పీకర్లు మొదలగు వాటిని కూడా సరిగా ఆపండి